lokame aranyabhumira
లోకమే అరణ్యభూమిరా
లోకమే అరణ్య భూమిరా - మనసులేని మనసులే ముండ్లపొదలురా... బ్రహ్మ దండి పొదలురా ఎదలోన గాయాలు రేపుతారురా - ఎంతో ప్రేమను పైకి చూపుతారురా ఎవరి ప్రేమ చూచిన కలుషితమేరా - ఎవ్వరిని గురిగాను ఎంచుకొనకురా మనసు పెంచుకోకురా || లోక || పొరుగు వాని క్షేమాన్ని ఓర్వలేరురా - పొడచి పొడచి మనసు విరచి చంపుతారురా పోయాక సానుభూతి తెలుపుతారురా పొర్లి పొర్లి ఏడ్చి మరి పొగడుతారురా || లోక || మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషా మరణమనే కడలి సుడులు దాటలేవురా మంచివాడను నేనని మోసపోకురా మనసులోని ద్వేషాన్ని పారదోలురా మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా || లోక ||
English Transliteration (or) Lyrics
lokame aranya bhumira - manasuleni manasule mundlapodalura... brahma dandi podalura edalona gayalu reputarura - ento premanu paiki chuputarura evari prema chuchina kalusitamera - evvarini guriganu enchukonakura manasu penchukokura || loka || porugu vani ksemanni orvalerura - podachi podachi manasu virachi champutarura poyaka sanubhuti teluputarura porli porli edchi mari pogadutarura || loka || manisini preminchaleni manisi o manisa maranamane kadali sudulu datalevura manchivadanu nenani mosapokura manasuloni dvesanni paradolura manasu nilipi yesu prema telusukonumura || loka ||